Surprise Me!

IPL 2018 : Axar Patel About Ashwin Bowling | Oneindia Telugu

2018-03-02 39 Dailymotion

I know Ashwin since I made my debut for India,” said Axar while in an interview. Axar has played under a number of captains in the past, he want to play under Ashwin's captaincy

ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్‌ పటేల్‌ పేర్కొన్నాడు. ఈ ఏడాది ప్లేయర్‌ రిటెన్షన్‌లో పంజాబ్‌ జట్టు అట్టిపెట్టుకున్న ఏకైక ఆటగాడు అక్షర పటేల్ కావడం విశేషం.
ప్లేయర్‌ రిటెన్షన్‌ ప్రాసెస్‌లో భాగంగా అక్షర పటేల్‌ను రూ. 6.75 కోట్లకు తన వద్దే అట్టి పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పంజాబ్ జట్టు మెంటార్‌ వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంపిక చేసినట్లు ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు.
అశ్విన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై అక్షర్‌ పటేల్‌ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికారిక వెబ్‌సైట్ kxip.in‌కు ఇచ్చిన ఇంటర్యూలో 'నేను భారత జట్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచి నాకు అశ్విన్‌ తెలుసు. తెలిసిన వ్యక్తితో కలిసి పని చేయడం మనకెప్పుడు లాభదాయకమే' అని అన్నాడు.
'క్రికెట్‌లో అశ్విన్‌కు ఎంతో అనుభవం ఉంది. ఇప్పుడు అతను కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోవడం సంతోషంగా ఉంది. ఒక బౌలర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉంటే ఎంతో మంచిది. అశ్విన్‌ అటాకింగ్‌ బౌలర్‌. వికెట్లు తీయడంలో దిట్ట. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లు పరుగులు సాధించకుండా, ఒత్తిడి పెంచడం నా పని' అని తెలిపాడు.

Buy Now on CodeCanyon